ఘోర పరభవాలను చవిచూస్తున్న హస్తం పార్టీకి మరో దెబ్బ తగలనుందా?.. మరో సీనియర్ నేత పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా?. హస్తిన వర్గాల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. జేపీ నడ్డా, ఆనంద్ శర్మ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే.ఈ నేపథ్యంలో జేపీ నడ్డాతో ఆనంద్ శర్మ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కానీ.. ఈ వాదనలను ఆనంద్ శర్మ ఖండించారు. బీజెపి చీఫ్ జేపీ నడ్డానే కాదు.. ఇతర పార్టీ నేతలను కూడా కలిసే హక్కు ఉందని , నాకు ఆయన బీజేపీ అధ్యక్షుడు కాదు, మేమిద్దరం ఒకే రాష్ట్రం నుండి వచ్చాము.. వారి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. నడ్డాను కలవడంతో విశేషం ఏముంది ? తాను కాంగ్రెస్‌కు చెందినవాడిననీ, ఆయన బీజేపీకి చెందిన వారు. ఇరువురి పార్టీల మధ్య సైద్ధాంతిక భేదాలు ఉండటం వల్ల రాజకీయ ప్రత్యర్థులమని అన్నారు. కానీ
తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకోచ్చారు. అయితే తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. తమ రాష్ట్రం, యూనివర్సిటీకి చెందిన వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం పట్ల తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం
నెహ్రూ- గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఆనంద్ శర్మకు గుర్తింపు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరిన జీ-23 సీనియర్ నేతల్లో ఆయన కూడా ఉన్నారు. జీ-23 నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేసి సమాజ్‌వాది పార్టీలో చేరడం తెలిసిందే. ఇప్పుడు ఆనంద్ శర్మ కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.