Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృంగారం మనిషిలో ఉత్సాహాన్ని నింపుతుంది.. ఉత్తేజాన్ని కలిగిస్తోంది.. అంతే కాదు.. ప్రాణాలు కూడా తీస్తుంది.. ఎందుకంటే.. తన ప్రియురాలితో శృంగారం చేస్తూ ఓ వ్యాపారవేత్త మృతిచెందిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ ఘటనతో వణికిపోయిన ప్రియురాలు.. ఏం చేయాలో తోచక.. వెంటనే తన భర్త, సోదరుడికి సమాచారం ఇచ్చింది.. దీంతో, ఎవరికీ తెలియకుండా.. ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. పడవేశారు.. అయితే, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు మొదట ఎలాంటి క్లూ దొరకలేదు.. కానీ, విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.. బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న వారం తర్వాత, మరణంపై దర్యాప్తులో ఆ వ్యక్తి తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడని తేలింది.
Read Also: Job In Cemetery: చదివింది డిగ్రీ.. శ్మశానంలో ఉద్యోగం.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
బెంగళూరులోని జేపీ నగర్ పుట్టెనహళ్లికి చెందిన బాల సుబ్రమణియన్ అనే 67 ఏళ్ల వ్యాపారవేత్తకు తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.. అవకాశం దొరికినప్పుడల్లా వారి మధ్య ఈ వ్యవహారం సాగుతూ వచ్చింది.. అయితే, సదరు వ్యాపారవేత్త నవంబర్ 16న తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.. ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మంచంపైనే కుప్పకూలిపోయాడు.. 16వ తేదీన తన మనవడిని బ్యాడ్మింటన్ కోచింగ్ దగ్గర దింపేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో తన కోడలికి ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని తెలిపాడు. ఆయన చేసిన చివరి ఫోన్ కాల్ అదే.. ఎంతకీ ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో.. అతని కుమారుడు సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత.. ప్లాస్టిక్ కవర్లు మరియు బెడ్‌షీట్‌లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
అయితే, సదరు వ్యక్తితో తనకు ఉన్న అక్రమ సంబంధం బయటపడితే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ మరియు ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి జేపీ నగర్‌లోని నిర్మూనుష్య ప్రాంతంలో పడేశారు.. ఇక, మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా అనుమానం వచ్చి.. ఆ మహిళను ప్రశ్నించారు.. దీంతో.. ఆ మహిళ అసలు విషయం తెలిపిందే.. భయపడే తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది. తానే హత్య చేశానని అంటారేమోనన్న భయంతో భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని పడేసినట్టు వెల్లడించింది.. కాగా, బాల సుబ్రమణ్యం తన ఇంట్లో పనిచేసే సదరు మహిళతోచాలా కాలంగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని వెల్లడైంది. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతుంది నిజమేనా? కాదా? అని నిర్ధారించడానికి బాల సుబ్రమణియన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు