Who is Shah Rukh Khan? Assam CM Himanta Biswa Sarma asked: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామంటూ పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Read Also: Guinnis Record: ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్.. గిన్నిస్ రికార్డుల్లో చోటు
ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ పై అడిగిన సమయంలో.. ‘‘ షారుఖ్ ఖాన్ ఎవరు..?’’ అంటూ ప్రశ్నించారు. పఠాన్ సినిమా గురించి తనకు తెలియదని గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ అని విలేకరులు అన్నప్పుడు.. రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి ఆందోళన చెందాలి.. హిందీ సినిమాల గురించి కాదంటూ చురకలు అంటించారు బిశ్వ శర్మ.
శుక్రవారం గౌహతి నగరంలో నారేంగిలో సినిమా ప్రదర్శించే థియేటర్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనిపై మీడియా సీఎంను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా బాలీవుడ్ నుంచి చాలా మంది సమస్యల గురించి ఫోన్ చేసినా.. షారుఖ్ ఖాన్ నాకు ఫోన్ చేయలేదు, అతను చేస్తే, నేను విషయాన్ని పరిశీలిస్తానని సమాధానం ఇచ్చారు సీఎం. థియేటర్ పై దాడి ఘటనపై శాంతిభద్రతలను ఉల్లంఘించిన కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బేషరమ్ రంగ్ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయరంగు బికినీ ధరించడం వివాదాస్పదం అయింది.