Guinnis Record: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గిన్నిస్ బుక్. ఈ ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉన్నా తమకంటూ ఓ ప్రత్యేకత, నైపుణ్యాన్ని కలిగి ఉంటే చాలు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించవచ్చు. ఈ గిన్నిస్ బుక్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు చేరుతూనే ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ కళాకారుడు కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. జైపూర్‌కు చెందిన కళాకారుడు నవరతన్ ప్రజాపతి మూర్తీకర్ తయారు చేసిన ఓ చిన్న స్పూన్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. ఓ చిన్న స్పూన్.. అంతేనా అనుకోకండి.. అందులోనే ప్రత్యేకత దాగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్పూన్. ఎంత చిన్నదీ అంటే.. బియ్యపు గింజ మీద పెట్టినా నిలబడగలిగేంత.
Read Also: Unstoppable 2: రొటీన్ టీజర్ అయినా భారీ వ్యూస్
మన దేశ కళాకారుడు ప్రజాపతి తయారుచేసిన ఈ స్పూన్ రెండు మిల్లీమీటర్ల ఎత్తు, 0.7 అంగుళాల పొడవు ఉంది. ఈ స్పూన్‌ను నవరతన్ ప్రజాపతి చెక్కతో తయారుచేయడం విశేషం. ఎంతో శ్రద్ధ పెట్టి ఈ స్పూన్‌ను అతడు రూపొందించాడు. ఈ క్రమంలో దీన్నిచూసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డుల్లోకి ఎక్కించేశారు. పనిలో పనిగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇంతకీ ఆ స్పూన్ పొడవు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్పూన్ పొడవు కేవలం 2 మిల్లీమీటర్లు. ఈ స్పూన్‌ను మనం ఉపయోగించలేం. కేవలం రికార్డు కోసమే ప్రజాపతి దీనిని తయారుచేశాడు.
New record: Smallest wooden spoon – 2 mm (0.7 inches) made by Navratan Prajapati Murtikar (India) 🥄 pic.twitter.com/wrFltImEPf
— Guinness World Records (@GWR) January 19, 2023