కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యూత్.. తమ పెళ్లి విషయంలోనూ.. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లా, ఫర్‌సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సందర్భంగా.. వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: భారీగా తగ్గిన కోవిడ్ కేసులు.. లక్ష దిగువకు…
ఆ పెళ్లి కొడుకు… చూడగానే ఆధార్ కార్డులా కనిపించేలా.. తన పెళ్లి కార్డ్‌ను ప్రింట్ చేయించి బంధువులు, మిత్రులకు పంచాడు.. తమ పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. భౌతికదూరం పాటించాలని ఆ కార్డులో పేర్కొన్నాడు.. ఇక, బార్ కోడ్ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌లో ఆధార్ నంబరు స్థానంలో పెళ్లి తేదీ.. ఆకింద అడ్రస్ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్ నియమాలు పొందుపర్చాడు.. ఇక ఏదైనా కొత్తగా కనిపిస్తే.. ఇట్టే వైరల్ చేసే నెటిజన్లు ఊరుకుంటారా..? ఇప్పుడు ఆ ఆధార్ కార్డును.. అదే ఆధార్ కార్డును పోలిఉన్న వెడ్డింగ్ కార్డును తెగ వైరల్ చేస్తున్నారు.