Rahul Gandhi: హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్యానాలో పరాజయంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై వర్క్ షాప్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఇక, జమ్మూకశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఆత్మ గౌరవానికి దక్కిన విజయం అని తెలిపారు. ఇక, హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేస్తున్నాం.. చాలా అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి.. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హర్యానాలో పార్టీ కోసం నిరంతరం పని చేసిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటామని రాహుల్ వెల్లడించారు.
Read Also: UPI Transaction: యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచిన ఆర్బీఐ..
అలాగే, హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ గెలిచింది. ఫలితాల్లో 90 సీట్లకు గానూ 48 చోట్ల విజయం సాధించింది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. గంట తర్వాత క్రమంగా ఫలితాలు తారుమారవడం స్టార్ట్ అయింది.. చివరకు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. కేవలం 37 సీట్ల వద్దే కాంగ్రెస్ ఆగిపోయింది. కొన్నిచోట్ల మెజారిటీలు అత్యల్పంగా నమోదవడంతో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొనింది.
जम्मू-कश्मीर के लोगों का तहे दिल से शुक्रिया – प्रदेश में INDIA की जीत संविधान की जीत है, लोकतांत्रिक स्वाभिमान की जीत है।
हम हरियाणा के अप्रत्याशित नतीजे का विश्लेषण कर रहे हैं। अनेक विधानसभा क्षेत्रों से आ रही शिकायतों से चुनाव आयोग को अवगत कराएंगे।
सभी हरियाणा वासियों को…
— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2024