హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది.
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.. ఏపీలో లాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని.. హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం సమర్ధనీయం కాదన్నారు.
Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను…
Haryana Election Results: హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విజయం సాధించబోతున్నాం.. చివరి రౌండ్ కంటే ముందే స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం అని భూపేందర్ సింగ్ తెలిపారు. ఇకపోతే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం సమయంలో లెక్కింపు మొదలైనప్పటి నుంచి జాతీయ పార్టీలు బీజేపీ – కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీనే కొనసాగుతోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపించిన మధ్యలో బీజేపీ…