Trump Tariffs India: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం.. ఇవాళ (ఆగస్టు 27న) తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి కొత్త టారీఫ్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి ఇండియన్ ఎగుమతులపై మొత్తం 50 శాతం భారం పడనుంది.…
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.