UP: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ పోస్టర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బరేలీలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 4న ‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్‌తో ఉన్న టెంట్‌ను పోలీసులు తొలగించిన తర్వాత కాన్పూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఒక మతపెద్ద మెమోరాండం సమర్పించాలని ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా శుక్రవారం ప్రార్థనల తర్వాత బరేలీలోని ఇస్లామియా మైదానం సమీపంలో భారీగా జనాలు గుమిగూడారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు కారణమైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 'బుల్డోజర్ చర్య' చేపట్టింది. నూహ్ జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ చర్య కొనసాగుతోంది. అల్లర్లకు దెబ్బతిన్న నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని తావ్‌డూ పట్టణంలో శుక్రవారం అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
Hindu man’s home set on fire in Bangladesh: బంగ్లాదేశ్ లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది మతోన్మాదులు హిందువుల పండగల సందర్భంలో, ఉత్సవాల సందర్భంలో గుడులపై దాడులు చేయడం, హిందువుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఇస్లాంను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ..బంగ్లాదేశ్ లోని నరైల్…