Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Pakistan: ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా…
Pakistan: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది.