మామూలుగా రాష్ట్ర ముఖ్యమంత్రులు బహిరంగ సభలు నిర్వహించడం పరిపాటే. అయితే అప్పుడప్పుడు వారి ముందే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఏ విధంగా స్పందించాలో తెలియక తెల్లముఖం వేసే సందర్భాలు చాలానే ఉంటాయి. అలాంటి ఘటనే ఇది.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ సభలో పాల్గొన్న సీఎం అశోక్ టీచర్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని అడిగారు.
దీనికి సమాధానంగా ఓ ఉపాధ్యాయుడు లేచి ‘సర్.. మాకు ట్రాన్స్‌ఫర్లు, కొత్త పోస్టుల కోసం తాము స్థానిక ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వాల్సి వస్తోంది.. ఆ సమస్యను తీర్చండి’ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా సీఎం అవాకయ్యారు. ఇది నిజమా అంటూ మరో ప్రశ్న సంధించడంతో అక్కడున్న టీచర్లంతా ముక్తకంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. ఈ హఠాత్పరిణామం నుంచి వెంటనే తేరుకున్న సీఎం అశోక్ దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.