జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. జికా వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూపీలోని కాన్పూర్ ప్రాంతంలోని ప్రజలే ఈ జికా వైరస్ బారినపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వరకు 25గా ఉన్న బాధితుల సంఖ్య తాజాగా 36కు చేరింది. పురపాలక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.
ఇంటింటికి తిరిగి ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లను కేటాయించారు. అంతేకాకుండా 150 ప్రత్యేక టీంలతో ఫాగింగ్, శానిటేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.