West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- బెంగాల్లో మసీదుల లౌడ్‌స్పీకర్ల తొలగింపుపై వివాదం.
- పోలీసుల మౌఖిక ఆదేశాలపై ముస్లిం నేతల ఆరోపణలు.
- రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ముస్లిం సంస్థల హెచ్చరిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు మసీదు నిర్వాహకులను లౌడ్ స్పీకర్లు తొలగించాలని మౌఖికంగా సూచిస్తున్నారనే ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేవని, మసీదు కమిటీలకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ వివాదంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ముస్లిం నేతలు హెచ్చరిస్తు్న్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌లోని రితబ్రతా బెనర్జీ వర్గం ఈ అంశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ పంచాయతీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందుకు చేరింది. టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసి, ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇస్తున్న ముగ్గురు ముస్లిం ఎంపీలు అమిత్ షాను కలిశారు. యూసుఫ్ పఠాన్, ఖలీలుర్ రెహమాన్, అబూ తాహెర్ ఖాన్లు అమిత్ షాకు వినతి పత్రాన్ని సమర్పించారు.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ఈ వివాదంపై టీఎంసీ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని, హిందువులు ఆలయాల్లో పూజలు చేసుకునే హక్కు ఉన్నట్లే, ముస్లింలకు మసీదుల్లో అజాన్ చెప్పి నమాజ్ చేసుకునే హక్కు ఉందని అన్నారు. జమియత్ ఉలేమా-ఎ-హింద్ బెంగాల్ అధ్యక్షుడు సిద్ధీకుల్లా చౌధురి కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు మసీదుల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?