Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆగస్టు 7న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘డీసీ’ వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ అని, లోకేష్ కనగరాజ్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అన్నారు. సినిమా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్‌ను తన సినిమాలో హీరోగా ఎలా ఒప్పించారో చెబుతూ.. “నేను ఎప్పటినుంచో చెప్పాలనుకున్న కథ ఇది. ఒక పార్టీలో లోకేష్‌ని కలిశాను. ఈ ఆలోచన ఆయనకు చెప్పి, మనిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని అన్నాను. ఆయనకు కథ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ కథ. తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగుతుంది అనేదే సినిమా” అని చెప్పారు. “లోకేష్ గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్. నేను కథ చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. అయితే అప్పటికి ఆయన ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. నేను కూడా ఇళయరాజా బయోపిక్ పనుల్లో ఉన్నాను. నా ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆయన కూలీ తర్వాత ఫ్రీ అయ్యారు. అలా ప్రాజెక్ట్ మొదలుపెట్టాం హీరోగా ఇది లోకేష్ గారికి తొలి సినిమా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అని లోకేష్ కనగరాజ్‌ను కొనియాడారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?