SIIMA 2023: సైమా.. సైమా .. సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది ఆనాటి కాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా మారింది. ఇక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అంటే అది వాళ్ళకి ఒక పెద్ద అచీవ్ మెంట్ లాగా నటీనటులు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తాజగా ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయ్యింది.
Venu Yeldandi: వెకేషన్ సరే.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.. ?
ఇక ఎప్పటిలానే ఆర్ఆర్ఆర్ ఇందులో కూడా మరో రికార్డును సృష్టించింది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్టేజిల మీద ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా మరోసారి రికార్డులను బ్రేక్ చేసింది. సైమా అవార్డుల నామినేషన్స్ లో ఏకంగా 11 కేటగిరిలో 11 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత 10 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్న సినిమాగా సీతారామం నిలిచింది. ఈ రెండు కాకుండా బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో తెలుగు నుంచి dj టిల్లు, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు నిలిచాయి. ఈ నామినేషన్స్ తరువాత మరోసారి ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారింది. మరి ఈ సినిమాలలో బెస్ట్ సినిమాగా ఏది నిలుస్తుందో చూడాలంటే ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డ్స్- 2023 ఈవెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.