తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లోక్‌సభ స్థానాలు పెరగాలంటే.. వెంటవెంటనే పిల్లల్ని కనడమే మార్గమని దంపతులకు సూచించారు.
ఇది కూడా చదవండి: Venkaiah Naidu : హీరోల పాత్రల తీరుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
గతంలో తానే నిదానంగా పిల్లల్ని కనండని చెప్పిన మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు అలా చెప్పకూడదన్నారు. ఎంత జనాభా ఉంటే.. అన్ని ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో కుటుంబ నియంత్రణ సక్సెస్ ఫుల్‌గా అమలు చేశాం.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఓపిగ్గా కనండి.. వెంటవెంటనే కనాలని సూచించారు. తమిళ హక్కులను తగ్గించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని.. ఎన్నికల సంఘంలో నమోదైన 45 పార్టీలను ఆహ్వానించినట్లు చెప్పారు. మరికొందరు అఖిలపక్ష సమావేశానికి రావడం లేదని చెబుతున్నారని.. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ డీఎంకే వ్యక్తిగత సమస్య కాదని చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడాన్ని రాజకీయంగా చూడొద్దని.. అందరూ కలిసి రావాలని పార్టీలను స్టాలిన్ కోరారు.
ఇది కూడా చదవండి: Dulquer Salmaan : లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఉండగా 28కి పెరుగుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బిహార్‌లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 128కి పెరిగే అవకాశం. బీహార్‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌లో 25 నుంచి 44కి లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో 28 స్థానాలుండగా.. 36కి పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: AP Assembly Budget Sessions: గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికడతాం!