బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా కదనరంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజయ్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.