జీ-రామ్-జీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లుకు అధికార పార్టీ ఆమోదించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. కొత్త పేరు జీ-రామ్-జీ పేరుతో బిల్లు ఆమోదించింది.
Rahul Gandhi: ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు.
యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా అమలవుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పేరును మార్చాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
MNREGA: దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది.