ఎయిరిండియా తీరుపై దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మధ్య కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఎయిరిండియా సర్వీస్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. తనకు విరిగిపోయిన సీటు ఇచ్చారంటూ మండిపడ్డారు. డబ్బులు తీసుకున్నవాళ్లు.. మంచి సర్వీస్ అందించాలని తెలియదా? అంటూ నిలదీశారు. అనంతరం మరికొందరు కూడా విమాన సర్వీసుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Mollywood : లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేస్తోన్న స్టార్ కిడ్
తాజాగాఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూడా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Bhopal: సినిమా తరహాలో ట్విస్ట్.. 2 ఏళ్ల తర్వాత హతురాలు ప్రత్యక్షం.. జైల్లో మగ్గుతున్న నిందితులు
ఎయిరిండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయని.. ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తున్నప్పటికీ విమానాలు సమయానికి చేరుకోవన్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గంటకు పైగా నిరీక్షించాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. కచ్చితంగా కఠిన నిబంధనలు విధించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఎంపీ సుప్రియా సూలే పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. తమ చేతుల్లోని లేని సమస్యల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని.. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రీ ట్వీట్ చేసింది.
ఇది కూడా చదవండి: Maruti Brezza: తక్కువ ఈఎంఐతో ఈ కారును కొనేయండి.. డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలంటే..?
I was travelling on Air India flight AI0508, which was delayed by 1 hour and 19 minutes — part of a continuous trend of delays affecting passengers. This is unacceptable.
Urging Hon’ble Civil Aviation Minister @RamMNK to enforce stricter regulations to hold airlines like… https://t.co/ydqw9NJzcR
— Supriya Sule (@supriya_sule) March 21, 2025
Dear Ma'am, we recognize that delays can be very frustrating. However, there are occasional operational issues outside of our control that can affect flight schedules. Your flight to Mumbai this evening was delayed by one hour due to such an issue. We appreciate your…
— Air India (@airindia) March 21, 2025