Indigo : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. Fake Birth Certificate Scam: దేశవ్యాప్త నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డాగా ఏపీలోని ఆ మండలం.. చాలా మందిప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్‌ల ఆలస్యం…
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే మేఘావృతం అయింది. అంతేకాకుండా గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ఈ మేరకు ప్రయాణికులను హెచ్చరించారు.
ఎయిరిండియా తీరుపై దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మధ్య కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఎయిరిండియా సర్వీస్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. తనకు విరిగిపోయిన సీటు ఇచ్చారంటూ మండిపడ్డారు.
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
Flight Delay: పొగమంచు, వాతావరణ పరిస్థితులు దేశంలో విమానయానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పొగమంచు పరిస్థితులు వందల సంఖ్యలో విమానాల రాకకు అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవస్థలు పడ్డారు. ఏకంగా కొందరు ప్రయాణికలు విమాన సిబ్బందిపై దాడులు చేయడమే చేయడం, ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేయడం వైరల్‌గా మారాయి.
Flight delay: పొగమంచు కారణంగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విమానాల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అవుతుందని ప్రకటించిన కెప్టెన్‌పై ప్రయాణికుడు అసహనంతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేంద్రం విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 100 విమానాలు ఆలస్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు…
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్‌పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.