మాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రణవ్ మోహన్ లాల్ కెరీర్ అండ్ లైఫ్ స్టోరీ డిఫరెంట్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోలేదు. అవకాశాల కోసం ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోలేదు. ఓన్ ఐటెంటీటీ కోసమే ప్రయత్నించాడు. అందుకే హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు ప్రణవ్. ఆ తర్వాతే యాక్టింగ్‌లోకి దిగాడు స్టార్ కిడ్.2018లో వచ్చిన ఆది మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రణవ్ ఈ ఏడేళ్లలో జస్ట్ ఐదు సినిమాలే చేశాడు. సెలక్టివ్‌గా కథలను ఎంచుకుని సక్సెస్ అందుకుంటున్నాడు.
Also Read : Tamannaah Bhatia : బ్రేకప్ తర్వాత సినీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోన్నమిల్కీ బ్యూటీ
హృదయం, వర్షంగళుక్కు శేషం బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ప్రణవ్ కెరీర్ తండ్రిలా పీక్స్ కు వెళ్లిపోతుందని అనుకున్నారంతా కానీ సినిమాలు, గినిమాలు జాన్తా నై కొంత స్పేస్ కావాలనుకుని స్పెయిన్ వెళ్లిపోయి సాదా సీదా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ స్టార్ కిడ్. భిన్నమైన ఆలోచనతో బతికేస్తోన్న ప్రణవ్ మోహన్ లాల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాశాడా అనుకుంటున్న తరుణంలో మాలీవుడ్‌లో ఓ బజ్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రణవ్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడట. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మయుగం ఫేం రాహుల్ సదాశివన్ తో వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ 2 నుండి వడకరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు ఇన్నర్ టాక్. ఈ సినిమాను నైట్ షిఫ్ట్, వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. హారర్ మిస్టరీగా సినిమాను తీసుకురాబోతున్నట్లు సమాచారం. అంతటి స్టార్ కిడ్ అయుండి కూడా తాను సొంతగా ఎదగలనుకునే ప్రణవ్ లాంటి హీరోలు ఈ రోజుల్లో చాలా అరుదు అనే చెప్పాలి.