Supreme Court: కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచరన్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా స్థానిక ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని ‘‘పాకిస్తాన్’’గా పేర్కొన్నారు. ఇదే కాకుండా ఓ మహిళ న్యాయవాదితో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.