indian Government holds all party meeting on Sri Lanka crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
అంతకుముందు ఆదివారం పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన సమావేశంలో తమిళ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు శ్రీలంక సంక్షోభంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరాయి. శ్రీలంకలో తమిళ జనాభా పరిస్థితితో పాటు రాష్ట్రంలోకి శరణార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో తమిళ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీకి, విదేశాంగ శాఖ జైశంకర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రీలంకలో తమిళ ప్రజల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకల సంక్షోభ సమయంలో సహాయక సామాగ్రిని పంపించాలని సీఎం స్టాలిన్, కేంద్రాన్ని కోరారు.
Read Also: Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్
సంక్షోభ సమయంలో శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు భారత్ అందించింది. సంక్షోభ సమయంలో ఏ దేశం శ్రీలంకను ఆదుకోకపోగా.. ఇండియానే శ్రీలంకకు సాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే శ్రీలంకకు నిత్యావసరాలు, ఇంధనం, ఎరువులు, ఔషధాలను ఇండియా అందించింది. వీటి విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భారత్ తమకు సాయం చేయాలని కోెరుతోంది. అక్కడి క్రికెటర్లు భారత్ ను శ్రీలంకకు పెద్దన్నగా పేర్కొంటూ..ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు ప్రశంసలు కురిపిస్తోంది. చివరకు డ్రాగన్ దేశం చైనా కూడా భారత్ సాయాన్ని కొనియాడింది. ఇదిలా ఉంటే రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీలంక గత ఏడు దశాబ్ధాల్లో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంకలో గత ఆదివారంతో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యాయి.