ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సంబంధాల మరింతగా పెరిగే విషయాన్ని జైశంకర్ నొక్కి చెప్పారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు జైశంకర్ ఆగస్టు 11 వరకు మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.
పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
చైనాలో పుట్టిన మాయదారి కరోనా మహమ్మారి.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి… భారత్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలంటూ.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని కూడా చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతోంది.. ఇక, భారత్‌లో నిన్నటి వరకు 137 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ జరిగింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్…
భారతదేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న సర్టిఫి కేట్లను గుర్తించాలని ఆయన కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారాక్ అల్ -హజరప్‌తో ఆయన సమా వేశం అయ్యారు. వీరిద్దరూ భారత్- జీసీసీ సంబంధాలపై సమీ క్షించి వాణిజ్యం, పెట్టు బడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన…
సింగపూర్ స్ట్రెయిన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం ఉందని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వెంటనే ఆ దేశం నుంచి విమానాల రాకపోలకు నిలిపివేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్‌గా మారిపోయాయి.. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది కేంద్రం.. ఆయన వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పందించిన భారత ప్రభుత్వం.. అరవింద్ కేజ్రీవాల్..…