శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.