ఏంటో ఈ లోకం.. ఎటుపోతుందో యువతరం.. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి కాకుండానే.. లవ్వులు ఏంటో..? ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? ఏమీ అర్థంకాని పరిస్థితి.. ఇంతలా వైరాగ్యం ఏంటి అంటారా? అయితే, తమిళనాడులో జరిగిన ఓ ఘటన చూస్తే.. మీరు కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంటే.. ఓ స్కూల్ విద్యార్థినికి.. మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. విద్యార్థిని బస్టాండ్‌లో కూర్చోగా.. యువకుడు తన జేబులోని నుంచి తాళి తీసి.. ఆ విద్యార్థిని మెడలో కట్టేశాడు.. మంచైనా చెడైనా చూసుకోవడానికి ఓ గ్యాంగ్ ఉంటుందిగా.. అలాగే.. తోటి విద్యార్థులు వారిపై పూలు చల్లి అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలను స్నేహితులు తన మొబైల్ ఫోన్లలో బంధించి.. ఆ తర్వాత సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో.. ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..
Read Also: IND Vs SA: నిర్ణయాత్మక వన్డే.. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
యూనిఫాంలో ఉన్న పాఠశాల బాలికకు యువకుడు మంగళసూత్రం కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమిళనాడులోని కడలూరు పోలీసులు.. వారిని విచారణకు తీసుకెళ్లారు.. అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి కాగా, బాలిక మాత్రం 12వ తరగతి చదువుతోందని చెబుతున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ప్రజలు షేర్ చేయడంతో, బాలిక స్కూల్ యూనిఫాం ధరించి ఉన్నందున ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని చాలా మంది పోలీసులను అభ్యర్థించారు. పోలీసులు విచారణ జరిపి.. పాఠశాల విద్యార్థిని మైనరా? కాదా ? అనే విషయాలు తెలుసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆ ఇద్దరినీ పీఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా.. స్కూల్ విద్యార్థినికి బస్టాండ్‌లో పెళ్లి చేసుకుంటుంటే.. పక్కనే ఉన్న తోటి విద్యార్థులు వారిని ప్రోత్సహించడం.. పూలు వర్షం కురిపించడం.. చూసి అంతా షాక్ అవుతున్నారు. మరోవైపు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిదంబరానికి చెందిన రచయిత బాలాజీ గణేశన్‌ను అట్రాసిటీ నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.