Road Safety Cameras expose Indian Man Affair In Kerala: ఒక ట్రాఫిక్ చలాన్ ఓ వ్యక్తి కొంపముంచింది. అతని ‘ఎఫైర్’ బండారాన్ని బట్టబయలు చేసింది. ఆ వ్యక్తి జైలుకు వెళ్లేంతవరకూ వ్యవహారం సాగింది. కేరళలో జరిగిన అనూహ్య ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 25వ తేదీన ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్‌పై మరో మహిళను ఎక్కించుకున్నాడు. హెల్మెట్ ధరించకుండా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో.. ఏఐ కెమెరాలు ఫోటో క్లిక్‌మనిపించాయి. ఆ వ్యక్తి భార్య పేరు మీద బండి రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో.. ఆ ఫోటోతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘటనకు సంబంధించిన టెక్ట్స్ మెసేజ్ ఆమెకు వెళ్లింది. ఆ మెసేజ్‌తో పాటు మరో మహిళతో తన భర్త ఉన్న ఫోటోని చూసి.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది.. వెంటనే భర్తను నిలదీసింది.
Ambati Rambabu : రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలి
ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమెకు కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని సమాధానం ఇచ్చాడు. కానీ.. భర్తపై నమ్మకం లేకపోవడంతో, అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించింది. ఇలా వారి మధ్య ఈ విషయంపై తరచూ గొడవలు జరిగాయి. కట్ చేస్తే.. మే 5వ తేదీన ఆ మహిళ తన భర్తపై కరమన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని శారీరకంగా హింసించడంతో పాటు తమ మూడేళ్ల కూతురిని కూడా వేధించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినా.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడ్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
7000-Year-Old Road: మధ్యదరా సముద్రం కింద బయటపడిన 7000 ఏళ్ల నాటి రోడ్డు
ఈ కేసు గురించి ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఆ మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకున్నామన్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 321, 341, 294 మరియు 75 జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. అతనితో పాటు బైక్ ఎక్కిన ఆ మహిళ ఎవరు? అన్నది ఇంకా తెలియరాలేదు. నిజంగానే అతని ప్రియురాలా? లేకపోతే అతడు చెప్తున్నట్టు లిఫ్ట్ ఇచ్చాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.