సీనియర్ నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి నేడు వైసీపీ చేరిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. యర్రం వెంకటేశ్వరరెడ్డి సీనియర్ నేత, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. వైఎస్ఆర్ తో కలిసి పని చేశారు.. సూరిబాబు కూడా మా పార్టీలోకి రావటం మంచి పరిణామన్నారు. వారిద్దరూ జనసేన, బీజేపీలకు రాజీనామా చేసి వైసీపి లో చేరటం సంతోషమన్నారు. అంతేకాకుండా.. ‘నన్ను ఓడించాలని ఆరోజు నాదెండ్ల మనోహర్ కుట్ర పన్ని యర్రం వెంకటేశ్వరరెడ్డి ని జనసేన టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏ రోజూ ఆయన్ని పట్టించుకోలేదు. రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలి.’ అని ఆయన అన్నారు. అంనతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి యర్రం వెంకటేశ్వరరెడ్డి అని, వారి సేవలను అన్ని విధాలా ఉపయోగించుకుంటామన్నారు.
Also Read : CSK vs DC: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. ఢీల్లీ లక్ష్యం ఎంతంటే?
అనంతరం యర్రం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో మా వాళ్లు జనసేనలో చేరమంటే చేరానన్నారు. జనసేన వాళ్లు ఇటీవల మీటింగ్ పెట్టి కూడా పలకరించలేదని, నాదెండ్ల మనోహర్ అప్పట్లో కండువా కప్పి టికెట్ ఇచ్చారన్నారు. నేను వైసీపీలో చేరటం వలన మావాళ్లు హ్యాపీగా ఉన్నారని, మున్ముందు కూడా పార్టీ కోసం పని చేస్తానన్నారు. వైసీపీ నేత సూరిబాబు మాట్లాడుతూ.. 2014లో పెదకూరపాడు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేశానని, తర్వాత ఎంపీగా పోటీ చేశానన్నారు. 30 ఏళ్లుగా అంబటి రాంబాబు తెలుసు అని, ఆయన వైసీపి లోకి రమ్మని ఆహ్వానించారన్నారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న పార్టీ వైసీపీ అని, అందుకే ఆకర్షితులై వస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తామన్నారు.
Also Read : 7000-Year-Old Road: మధ్యదరా సముద్రం కింద బయటపడిన 7000 ఏళ్ల నాటి రోడ్డు