Eesha Rebba: అచ్చ తెలుగు అందం ఇషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అభినయానికి అభినయం. కానీ, ఈ ముద్దుగుమ్మను మాత్రం టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇషా సెకండ్ హీరోయిన్ గానో, కీలక పాత్రల్లోనే నటించింది. హీరోయిన్ గా ఇప్పటివరకు ఇషాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రస్తుతం ఇషా కోలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అయ్యింది. తెలుగు హీరోయిన్లు ఎక్కువగా తమిళ్ లో నే పేరు తెచ్చుకుంటారు అనేది అందరికి తెల్సిందే. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు స్టార్ అనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్స్ తో కుర్రకారు ను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ అయినా, మోడ్రన్ అయినా, స్టైలిష్ లుక్ అయినా.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అయినా ఇషా అదరగొట్టేస్తుంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో కనిపించి ఔరా అనిపించింది. గుమ్మం ముందు కూర్చొని ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. చిలకపచ్చ చీర.. తీర్చిదిద్దినట్లు కట్టి, తెలుగింటి ఆడపడుచు కనిపించింది.
JailerFirstSingle: జైలర్ ఫస్ట్ సింగిల్ అవుట్.. తమన్నా అందాలే హైలైట్
ఒక ఇంటి గేటు మెట్ల మీద కూర్చోని .. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. దీంతో ఇషా.. ఎవరికోసం ఈ ఎదురుచూపులు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం అమ్మడు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక స్టార్ తో ఇషా పప్రేమలో ఉందని, త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వినిపించాయి. అందులో ఎటువంటి నిజం లేదని ఆమె తేల్చి చెప్పింది. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. మరి ఈ అమ్మడికి హిట్ ఇచ్చే సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి.