Python attack on a Man.. Incident in Tamil Nadu: తమిళనాడులో ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. ఎవరూ చూడకపోయుంటే ప్రాణాలు పోయేవే. అయితే లక్కీగా దాడి జరిగిన సమయంలో మిగతా ప్రజలు ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏకంగా గంటపాటు కొండచిలువతో పోరాటం కొనసాగింది. వ్యక్తి కాలుకు చుట్టుకున్న కొండచిలువను వదిలించేందుకు గంట పాటు రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది అధికారులు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Read Also: PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
తమిళనాడులోని తిరుపత్తూరులోని ఓ గ్రామంలో 9 అడుగుల ఓ కొండచిలువ వ్యక్తి కాలుకు చుట్టుకుని వదలలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు కొండచిలువను వదిలించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా విఫలం అయ్యారు. చివరకు అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వ్యక్తిని రక్షించారు. శంకర్ అనే వ్యక్తి తన తోటలోకి 9 అడుగుల కొండచిలువ ప్రవేశించినట్లు గుర్తించి.. దానిని తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా కొండచిలువ శంకర్ పై దాడి చేసింది. అతని కాలును పట్టుకుని వదలలేదు. స్థానికులు ఎంత ప్రయత్నించినా.. కొండచిలువ పట్టునుంచి శంకర్ ను విడిపించలేకపోయారు. గంటపాటు శ్రమించిన తర్వాత రెస్క్యూ టీం కొండచిలువ బారి నుంచి శంకర్ ని రక్షించింది. కొండచిలువన సమీపంలోని అడవిలో వదిలేశారు.