కాశ్మీర్‌లో శాంతి నెలకొంది.. భూములు కొనుక్కోవాలని మోడీ చెప్పారని.. ఎక్కడుందని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్బంగా ప్రియాంకా గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. అధికారపక్ష నేతలు వివిధ అంశాలపై మాట్లాడారని.. కానీ పహల్గామ్ ఉగ్రదాడి ఎందుకు, ఎలా జరిగిందో మాత్రం చెప్పలేదని విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Amit Shah: పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదు.. విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
ఉగ్రవాదుల్ని తుది ముట్టించామని అమిత్ షా చెబుతున్నారని.. అసలు పహల్గామ్ ఉగ్ర దాడి నిఘా వైఫల్యం కాదా? అని నిలదీశారు. పహల్గామ్‌లో భద్రతా సిబ్బందిని ఎందుకు లేరని ప్రశ్నించారు. టీఆర్ఎఫ్ అనేది కొత్తగా రాలేదని… కాశ్మీర్‌లో చాలా చోట్ల ఆ ఉగ్ర సంస్థ దాడి చేసిందన్నారు. 2024లో టీఆర్ఎఫ్ దాడుల్లో 9 మంది చనిపోయారని తెలిపారు. అయినా ఉగ్ర సంస్థ వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? అని అడిగారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు బాధ్యత ఎవరిది?, హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా? అని ప్రియాంక గాంధీ నిలదీశారు.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు లోక్‌సభలో చర్చ కొనసాగింది. అమిత్ షా మాట్లాడుతూ.. విపక్షాల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే భారత్‌కు ఈ పరిస్థితి వచ్చిందంటూ దుమ్మెత్తిపోశారు. నెహ్రూ విధానాలు దేశాన్ని వెంటాడుతున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక మహాదేవ్ ఆపరేషన్‌లో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా తెలిపారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.