Amit Shah: పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదు.. విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదు
- విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చారిత్రాత్మక వైఫల్యాల కారణంగానే పాకిస్థాన్‌పై యుద్ధం కొనసాగించలేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ఎంట్రీ.. స్థానికులు ఏం చేశారంటే..!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
జవహర్‌లాల్ నెహ్రూ వల్లే పీఓకే ఉనికిలో ఉందన్నారు. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం గురించి గుర్తుచేశారు. దేశానికి సంబంధించిన 80 శాతం నదీ జలాలను కాంగ్రెస్ పాకిస్థాన్‌కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం గైర్హాజరవ్వడానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా ఉంది.. కానీ భారతదేశం లేదన్నారు. భారతదేశం తన స్థానాన్ని దక్కించుకోవడానికి మోడీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నెహ్రూ తీసుకున్న చారిత్రక వైఖరే కారణమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Amit Shah: మహాదేవ్ ఆపరేషన్‌తో పహల్గామ్ ఉగ్రవాదులు హతమయ్యారు
ఇక రాహుల్‌గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబం చైనాకు అనుకూలంగా ఉంటుందని ఆరోపించారు. డోక్లాంలో మన సైనికుల్ని చైనీయులు వ్యతిరేకంగా నిలబడితే.. రాహుల్‌గాంధీ మాత్రం చైనా రాయబారిని కలిశారన్నారు. చైనా పట్ల అనుకూల వైఖరి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి సోనియా గాంధీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంక్రమించిందని ఆరోపించారు.
మాజీ హోంమంత్రి పి. చిదంబరంపై కూడా నిప్పులు చెరిగారు. పరోక్షంగా చిదంబరం పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల పాకిస్థాన్ గుర్తింపుకు సంబంధించిన ఆధారాలను ప్రశ్నించారని.. పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల ఏమి లభిస్తుంది? అని ప్రశ్నించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీలేనని తెలిపారు. మహాదేవ్ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల దగ్గర ఓటరు ఐడీ నంబర్లు ఉన్నాయని… పాకిస్థాన్‌లో తయారైన చాకెట్లు ఉన్నాయని వెల్లడించారు. పహల్గామ్ దాడిలో ఇస్లామాబాద్ హస్తం ఉందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన రుజువు ఏం కావాలని అడిగారు. చిదంబరం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని.. ఇక ముగ్గురు ఉగ్రవాదులు హతం కావడం కూడా విపక్షాలకు నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!