Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పీకే..? సోనియా, రాహుల్‌తో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇక, పీకే కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోనియా-పీకే సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.. గుజరాత్ పోల్స్‌పై చర్చించడానికే ఈ భేటీ జరిగిందని.. గుజరాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల బ్లూప్రింట్‌పై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌కు అప్పగిస్తుందనే ప్రచారం కూడా ఉంది..
Read Also: TDP: జగన్ కేసుల్లో సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇక, 2020లో కాంగ్రెస్‌లో చేరాలని ప్రశాంత్ కిషోర్ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ, అనేక విషయాలపై విభేదాల కారణంగా ప్లాన్ వర్కవుట్ కాలేదు. అయితే, ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై చర్చించేందుకు ఇవాళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోందని చెబుతున్నారు.. ఇటీవలి ఎన్నికల పరాజయంతో సహా అనేక ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ హాజరు కావడం ప్రాధాన్యతగా మారింది.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఇక, మార్చిలో, ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీని కలిశారని గతంలో ప్రచారం సాగింది. రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ భేటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, ప్రశాంత్ కిషోర్ మళ్లీ పార్టీలో చేరుతున్నారనే సందడి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!