Narandra Modi: ప్రజలే మాకు తొలి ప్రాధాన్యత.. అందుకే ధరలు తగ్గించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందని మెదీ గుర్తుచేశారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్‌కు రూ.200 సబ్సిడీ ఇవ్వడం పేద కుటుంబాలకు బడ్జెట్ విషయంలో ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.
It is always people first for us!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh
— Narendra Modi (@narendramodi) May 21, 2022
Petrol Rates: రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ ధరలు తగ్గిస్తాయా?
మరోవైపు ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు ప్రధాని మోదీకి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ట్యాక్సులు తగ్గించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యాట్‌ను విపరీతంగా పెంచడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ తగ్గించాలని.. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!