ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్-భార్య బ్రిగిట్టే మధ్య జరిగిన పోట్లాటకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో మాక్రాన్‌ను భార్య కొట్టిందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: 25 ఏళ్ల పెద్దదైన టీచర్‌తో ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రేమ పెళ్లి.. భార్య కూతురు మక్రాన్ క్లాస్ మేట్..
తాజాగా ఈ అంశంపై మాక్రాన్ స్పందించారు. సోమవారం వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగే రాష్ట్ర విందుకు హాజరయ్యే ముందు మెట్రోపోల్ హోటల్ దగ్గర మీడియాకు క్లారిటీ ఇచ్చారు. సరదాగా తన భార్య.. ముఖంపై చెయ్యి వేసి నెట్టిందని.. ఇది జోక్‌గా జరిగిన సంఘటనే అని తేల్చి చెప్పారు. ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ గొడవ ఉందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తామిద్దరం తరచుగా ఇలా చేసుకుంటామని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ శాంతించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Ganja Smuggling: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. ఎలా చిక్కారంటే..!
నాలుగు రోజుల ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు మాక్రాన్ దంపతులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో విమానం తలుపు తెరుచుకోగానే.. భార్య బ్రిగిట్టే.. మాక్రాన్ ముఖంపై దాడి చేసింది. చెంప దెబ్బలు కొట్టింది. దీంతో మాక్రాన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే మాక్రాన్ తేరుకుని హాయ్ చెప్పడం కనిపించింది. ఇక విమానంలోంచి భార్యతో దిగబోతుండగా చెయ్యి పట్టుకునేందుకు మాక్రాన్ ప్రయత్నించారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఎడముఖం పెడముఖంతోనే ఇద్దరూ విమానం దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అదేమీలేదని మాక్రాన్ క్లారిటీ ఇచ్చారు.