ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేకుంటే బుల్లెట్ ఉందని పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సోమవారం గుజరాత్‌లో పర్యటించారు.
మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మరొకసారి పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిందూర్ అనేది వివాహానికి సంకేతమని.. దానిని తుడిచివేయడం అంటే వైధవ్యాన్ని సూచిస్తుందన్నారు.