Vice President: పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి! వారికి ఛాన్స్ లేనట్లే!
- పార్టీ విధేయుడికే ఉపరాష్ట్రపతి పదవి!
- వారికి ఛాన్స్ లేనట్లే! తేల్చేసిన బీజేపీ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఊహించని రీతిలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంత సడన్‌గా రాజీనామా ఎందుకు చేశారంటూ రకరకాలైన ఊహాగానాలు వచ్చాయి. అనారోగ్యం కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో జరిగిందంటూ విపక్షాలు కోడైకూస్తున్నాయి. మొత్తానికి రెండేళ్ల పదవి ఉండగానే ధన్‌ఖర్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record : ప్రత్యక్ష రాజకీయాల వైపు మల్లారెడ్డి కోడలు అడుగులు?
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్‌లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్‌కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్‌కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్‌లో ఎంబసీపై దాడులు.. నకిలీ రాయబారి అరెస్ట్
తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.
ఇటీవల జేడీయూ నాయకుడు, కేంద్రమంత్రి రామ్‌రాథ్ ఠాకూర్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఠాకూర్‌కు ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను బీజేపీ వర్గాలు తీవ్రంగా తోసిపుచ్చాయి. సాధారణ సమావేశమే తప్ప.. అందులో విశేషం ఏమీలేదని తేల్చేశాయి. ఆ పదవి గురించే చర్చ జరగలేదన్నారు.
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్‌లో తెలిపింది.
తాజావార్తలు
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!