చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
తమ మద్దతు పాకిస్థాన్‌కేనని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ తేల్చిచెప్పారు. తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్వత్వ బిడ్‌ను భారత్ అడ్డుకుందని ఆరోపించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదని.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. చైనాలోని టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిగ్రరాగ్ర సమావేశంలో మోడీ ప్రసంగించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మోడీ ప్రస్తావించారు.
చైనా వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో సమావేశంలో పాక్ ప్రధానికి ప్రధాని మోడీ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్‌కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక…
ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
SCO Summit: భారతదేశం ఉగ్రవాదంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు.
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.
Bilawal Bhutto: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ హాజరయ్యారు. దాదపుగా 12 ఏళ్ల తరువాత ఓ పాకిస్తాన్ ప్రతినిధి ఇండియాకు రావడం ఇదే తొలిసారి.