Parents’ responsibility : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లల మనోభావాలపై ప్రభావం చూపే అనేక అంశాల్లో, తల్లిదండ్రుల వ్యవహారశైలి చాలా ముఖ్యమైనది. వారు చేసే కొన్ని చిన్నచిన్న తప్పులు, పిల్లల ఆలోచనా ధోరణిని పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో తల్లిదండ్రుల మాటలు, నడవడి తీరు పిల్లల మీద ఊహించని ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక దుర్వినియోగ పరంపర ఏమిటంటే ..
Also Read : Regina Cassandra : పీఆర్ చూసి ఛాన్స్‌లు.. ఇండస్ట్రీ రియాలిటీ పై రెజీనా ఓపెన్ టాక్
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ఆడవాళ్లను చిన్నచూపు చూడటం, తక్కువ చేయడం. “ఆడపిల్లలా నడవొద్దు”, “నువ్వేమన్నా ఆడదానివా?”, “ఆడవాళ్ల పనులేంటి నీకూ?” లాంటి వ్యాఖ్యలు పెద్దల నోటి నుంచి పిల్లల ముందు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటలు చిన్నప్పటి నుంచే పిల్లల మనసుల్లో పిచ్చి గోడలు కట్టేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లాడికి ఆడుకోవడానికి బొమ్మతుపాకీలు తెచ్చే తల్లిదండ్రులు, తమ కూతురి కోసం కిచెన్ సెట్ తెచ్చి ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం నీ పని అనే సూత్రాన్ని నాటితే. అబ్బాయిని దుకాణాలకు పంపే పేరెంట్స్, అమ్మాయిలకు ఇల్లు శుభ్రం చేసే పని అప్పగిస్తుంటారు. అంతేకాదు కుర్రాడు ఆసక్తి కొద్దీ.. గరిట పట్టుకుంటే.. ‘నీకెందుకురా ఆడవాళ్ల పనులు’ అంటూ బయటికి పంపిస్తుంటారు.
ఈ పరిస్థితిని మార్చాలంటే మొదట తల్లిదండ్రులే తమ అభిప్రాయాలను మార్చుకోవాలి…
– పిల్లల అభిరుచులు, ఆసక్తుల పట్ల గౌరవం చూపాలి.
– ఏ పని ఆడవాళ్లది, మగవాళ్లది అన్న భేదాలు పోగొట్టాలి.
– పిల్లల నైపుణ్యం, శక్తిని బట్టి వాళ్లకు అనువైన అవకాశాలు ఇవ్వాలి.
– ముఖ్యంగా, ఆడ – మగ అనే ప్రాతిపదికపై వ్యాఖ్యలు చేయడం మానేయాలి.
ఈ తరం తల్లిదండ్రులు తమ వైఖరిలో మార్పు తీసుకొస్తే.. వారి పిల్లలు లింగ సమానత్వాన్ని సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే మన సమాజాన్ని ఇన్నేళ్లుగా బాధిస్తున్న లింగ వివక్షకు గట్టి కుదుపు ఇవ్వడం సాధ్యమవుతుంది. మార్పు ఓ తరం నుంచే మొదలవుతుంది. ఆ మార్పుకు నాంది పలకాల్సింది మీరు – తల్లిదండ్రులే!
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?