భారత్, చైనా మధ్య విమాన కనెక్టివిటీ తిరిగి ప్రారంభం కానుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 9 నుంచి షాంఘై, న్యూఢిల్లీ మధ్య రౌండ్-ట్రిప్ విమానాలను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. షాంఘై, ఢిల్లీ మధ్య ప్రతి బుధ, శని, ఆదివారాల్లో ఈ విమానం నడుస్తుందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ విమానం షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి సాయంత్రం…
India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది.
Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో, భారత్, చైనాలు గత ఘర్షణలను మరించి స్నేహంగా మెలగాలని నిర్ణయించుకున్నాయి. దీనికి ఇటీవల చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-జిన్‌పింగ్-పుతిన్ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
Putin: చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న 25వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోడీ, చైనాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, ఈ సమావేశం జరుగుతుండటంతో ప్రపంచ దృష్టి అంతా ఈ సమావేశాలపైనే ఉంది.
Modi foreign visit schedule: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29 – 30 తేదీలలో జరగనున్న 15వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లడం దీంతో కలిపి 8వ సారి, ఆ దేశ ప్రధానమంత్రి ఇషిబాతో ఇది మోడీకి మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది.…
వచ్చే నెలలో భారత్- చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరం అయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతాయని పేర్కొంది.
Prime Minister Narendra Modi: 2020లో జరిగిన గాల్వాన్ వివాదం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి చైనాకు వెళ్లనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని చైనాను సందర్శించనున్నారు. అమెరికా సుంకాల వేళ మోడీ చైనా పర్యటన ప్రపంచ దేశాల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది. టియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని చైనా, భారత ప్రధానమంత్రిని ఆహ్వానించింది. READ MORE: Rahul…
S Jaishankar: చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు…
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.