Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు. భారత్‌తో అమెరికా తన సంబంధాలను మరింతగా పెంచుకోవడంతో ఇస్లామాబాద్‌కు ఎలాంటి సమస్య లేదని అన్నారు. అయితే పాకిస్తాన్ కు నష్టం కలిగించకపోతే, భారతదేశంతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న అమెరికాతో మాకు ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు.
Read Also: Mahindra’s Armado: ఆర్మీ కోసం మహీంద్రా “ఆర్మడో”.. బండి మామూలుగా లేదుగా..!
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
కాశ్మీర్ సమస్యపై గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా.. పాకిస్తాన్ తన పొరుగు దేశాలు, ప్రాంతీయ భాగస్వాములతో సత్సంబంధాలను కోరుకుంటోందని మంత్రి అన్నారు. మాకు చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ తో ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయి. మేము అందరితో సత్సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటున్నామని, శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని అన్నారు. శాంతి లేకుంటే ఆర్థికంగా ఎదగడం ఎప్పటికీ జరగదని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. జూన్ 20న మోడీ న్యూయార్క్ చేరుకోనున్నారు.. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. భారత-అమెరిన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 22న మోడీకి అధికారిక స్వాగత వేడుకను చూసేందుకు భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికా రాజధానికి వెళ్లనున్నారు.అదే రోజు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ జోబైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ వైట్ హౌజులో ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!