Mahindra’s Armado: దేశీయ దిగ్గజ కార్ మేకర్ మహీంద్ర ఇండియా సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని రూపొందించింది. ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV) ‘ఆర్మడో’ డెలివరీని ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(MDS) పేరుతో పూర్తి దేశీయ టెక్నాలజీతో మహీంద్రా గ్రూప్ ఈ వాహనాలను తయారు చేస్తోంది.
దీనిపై మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘మహీంద్రా డిఫెన్స్, మేము ఇప్పుడే ఆర్మడో- భారతదేశపు మొదటి ఆర్మడర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికిల్ డెలివరీని ప్రారంభించాము. మన సాయుధ దళాల కోసం భారతదేశంలో గర్వంగా అభివృద్ధి చేసి రూపొందించబడింది. జైహింద్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులు పాలుపంచుకున్న వారికి ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. సహనం, పట్టుదల, అభిరుచితో ఈ ప్రాజెక్టును నిజం చేసిన సుఖ్‌విందర్ హేయర్ అతని టీంకి నా కృతజ్ఞతలు అంటూ మహీంద్రా మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
Read Also: Tamil Nadu: పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా చంపారు.. వీడియో
ఆర్మడో అనేది భారత రక్షణ దళాల ఉపయోగం కోసం నిర్మించిన తేలికపాటి సాయుధ వాహనం. ఇది అదనపు లోడ్ బేరింగ్ కెపాసిటీతో వస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు, ఉద్రిక్త ప్రాంతాలలో పెట్రోలింగ్ లలో ఉపయోగపడనుంది. ప్రత్యేకదళాలు, క్విక్ యాక్షన్ టీమ్స్ కి ఈ వాహనం చాలా అనుకూలంగా ఉండనుంది. దీన్ని సరిహద్దుల వెంబడి ఎడారి ప్రాంతాల్లో, సరిహద్దు భద్రత కోసం ఉపయోగించవచ్చు.
ఢిపెన్స్ రంగంలో భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ కి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో సొంతగా ఆర్మీకి, ఇతర సాయుధ దళాలకు అవసరమయ్యే పరికరాలను, ఆయుధాలను ఇండియాలోనే తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. దీంట్లో భాగంగానే మహీంద్రా తన ఆర్మడోను తీసుకువచ్చింది.
At #MahindraDefence we have just begun deliveries of the Armado—India’s 1st Armoured Light Specialist Vehicle. Designed, developed & built with pride in India for our armed forces. Jai Hind. 🇮🇳
I salute @Prakashukla who has led our Defence Sector with enormous commitment. pic.twitter.com/TtyB0L8MrT— anand mahindra (@anandmahindra) June 17, 2023