Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.