రవితేజ కు జోడిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఒక్కసారిగా వరుస అవకాశాలు తలుపుతట్టడంతో క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తుండగా, రామ్ తో #RAPO22, దుల్కర్ సల్మాన్ తో ‘కాంత’ సినిమాలతో బిజీగా ఉంది. మరో రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయట. అయితే మంగళవారం మే6న భాగ్య శ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్రాల మేకర్స్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో ‘కాంత’ మూవీ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, ల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ 1950 మద్రాస్ నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. అందుకే భాగ్యశ్రీ ఫస్ట్ లుక్స్1950ల నాటి క్లాసిక్ రెట్రో లుక్‌తో పోస్టర్ ఆకట్టుకుంటున్నది. వినూత్నమైన పీరియాడిక్ కథాంశమిదని, నాటి ప్రజల జీవితానికి అద్దం పడుతుందని, భాగ్యశ్రీ బోర్సే పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందట. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఝను చంతర్ సంగీతం అందిస్తుండగా, రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.