Nirmala Sitharaman: “ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ
- బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి..
- ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిందే ఈ బడ్జెట్: నిర్మలా సీతారామన్..
- వేతనజీవులకు రూ.12 లక్షల వరకు పన్ను తగ్గింపు వెనక ప్రధాని మోడీ ఉన్నారు: ఆర్థిక మంత్రి నిర్మలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాం.. నిజాయితీగా ఉంటూ దేశానికి సేవ చేస్తున్నాం.. మీరు మా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత ఆయన మార్గ నిర్థేశంతో ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చింది. అందుకే, ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ పన్ను తగ్గింపు ఆలోచన వెనక ప్రధాని మోడీ ఉన్నారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
అయితే, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నప్పటికి తమ ఆకాంక్షలు నెరవేరలేదని కంప్లైంట్ చేస్తున్న మిడిల్ క్లాస్ ప్రజల గొంతు తాము విన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ప్రధాని మోడీ అన్ని రంగాలకు చెందిన వ్యక్తులతో పాటు పరిశ్రమిక వర్గాల వాణిని కూడా విన్నారని చెప్పుకొచ్చింది. అందరిని కలిసి మాట్లాడుతారు.. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారని పేర్కొనింది. ఈ ప్రభుత్వంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన తొలి పూర్తి బడ్జెట్‌లో వేతన జీవులకు కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ అని వెల్లడించింది. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!