Bihar Political Crisis: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. బిహార్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాత ఎన్‌డీఏ నుండి వైదొలగాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని నితీష్ కుమార్ వెల్లడించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయేకు గుడ్‌బై చెప్పాలని నితీశ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా…
బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలిసి, రాజీనామా లేఖ అందిస్తారని తెలిసింది. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జేడీయూ అధిష్ఠానం పాట్నాలో నిర్వహించిన సమావేశం కీలక చర్చలకు వేదికైనట్లు తెలిసింది.