Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు జేడీయూలో కలకలం చెలరేగింది. రాష్ట్రంలో అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనేక మంది ప్రముఖులను బహిష్కరించింది. పార్టీ సమాచారం ప్రకారం.. సస్పెండ్ అయిన వారిలో మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, MLC లు ఉన్నారు. వాస్తవానికి JDU తీసుకున్న ఈ సంచనల నిర్ణయంతో పార్టీలో కలకలం రేపింది. ఈ బహిష్కరణలకు సంబంధించిన అధికారిక ప్రకటన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందన్ కుమార్…
Bihar Elections 2025: బీహార్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. తాజాగా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ నితీష్ కుమార్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. పలువురు విలేకరులు పప్పు యాదవ్‌తో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్‌ను గౌరవించదని ఆయన బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుందా అని అడిగినప్పుడు, పప్పు యాదవ్ స్పందించి…
బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు.
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముచ్చటగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Rohini Acharya : బీహార్ రాజకీయాల్లో ఈరోజు చాలా కీలకం కానుంది. మరోసారి సీఎం నితీశ్ కుమార్ పార్టీ మారనున్నారు. ఈరోజు నితీష్ కుమార్ మహాకూటమిని వీడి ఎన్డీయేలో చేరనున్నట్లు సమాచారం.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో నితీష్‌కుమార్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం.. వారితో కలిసి నవ్వులు చిందించడంతో అప్పుడే సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయని సంకేతాలు వెళ్లాయి.
బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి.
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు.