House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- యూపీలో ఘోర విషాదం
- నిద్రలోనే తెల్లారిన బతుకులు
- 100 ఏళ్ల పురాతన ఇల్లు కూలి ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహులీ గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. 28 ఏళ్ల యువకుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిన ఇల్లు
మహులీ గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవకు చెందిన ఇల్లు చాలా కాలంగా పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. భారీ శబ్దాలు, కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
శిథిలాల కింద ఆరుగురు మృతి
రక్షణ సిబ్బంది, స్థానికుల సహకారంతో శిథిలాలను తొలగించి ఇంట్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో కుటుంబ పెద్ద ప్రమోద్ శ్రీవాస్తవతో పాటు రీటా, నితిన్, మాధురి, మాధవ్, అద్విక్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. మృతుల్లో దంపతులతో పాటు వారి కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రమోద్ శ్రీవాస్తవ కుమారుడు అమన్ (28) ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల నుంచి అతడిని సురక్షితంగా బయటకు తీసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
ప్రతాప్‌గఢ్‌లో వరుస విషాద ఘటనలు
ఇటీవల ప్రతాప్‌గఢ్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరో ఘటన కూడా చోటుచేసుకుంది. పట్టి తహసీల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఓ రైతుకు చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రైతు గాయపడగా, అతని పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. తాజా ఘటనతో జిల్లాలో పాత ఇళ్లు, వర్షాల సమయంలో వాటి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!