Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా, బట్లర్ కేవలం 20 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడి నాటౌట్‌గా 51 పరుగులు చేశాడు. దీంతో అతని టీ20 కెరీర్ స్కోరు 522 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులకు చేరింది.
ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్న అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని, అయితే రికార్డులు తుదివరకు నిలవవని బట్లర్ అన్నాడు. భవిష్యత్తులో తన ప్రపంచ రికార్డును తిరగరాసే సత్తా భారత్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే ఉందని బట్లర్ జోస్యం చెప్పాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన వైభవ్, టీ20లలో ఇప్పటికే 40 మ్యాచ్‌ల్లో 1,670 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఇక, 35 ఏళ్ల జోస్ బట్లర్ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరఫున 160 టీ20ల్లో 4,212 పరుగులు చేసిన అతను, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేర్వేరు ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైటాలిటీ బ్లాస్ట్‌లో లంకాషైర్, సమర్సెట్.. SA20లో పార్ల్ రాయల్స్, డర్బన్స్ సూపర్ జెయింట్స్.. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్.. బీపీఎల్‌లో కమిల్లా విక్టోరియన్స్లకు ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి దిగ్గజ జట్లకు ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు.
Also Read
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?