Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Birthday 2026: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు అది ఒక ప్రత్యేక పండుగ. ప్రతి ఏడాది ఆగస్టు 9న జరిగే ఈ వేడుకలు ఈసారి మరింత ఘనంగా ఉండబోతున్నాయి. మహేష్ బాబు తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఇప్పటికే అభిమానుల సందడితో కళకళలాడుతోంది. ప్రత్యేక సినిమా ప్రదర్శనలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఫ్యాన్ మీట్లు, థీమ్ ఈవెంట్లతో నగరం మొత్తం వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది.
ఈసారి సంబరాలకు ప్రధాన ఆకర్షణగా మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దూకుడు’ రీ రిలీజ్ కానుంది. అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని మరోసారి థియేటర్లలో ప్రదర్శించనుండగా, నగరంలోని పలు థియేటర్లలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మూసాపేట్‌లోని ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్లో ఆగస్టు 9 ఉదయం 8 గంటలకు నిర్వహించే ఫ్యాన్ షో అత్యంత భారీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు పలు ఏర్పాట్లు చేశారు అభిమానులు. థియేటర్లో కాగితాల వర్షం, మహేష్ బాబు ఫ్యాన్ ఎడిట్ల ప్రదర్శన, టపాసుల సందడి, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, 51 కిలోల భారీ బర్త్‌డే కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు ప్లాన్ చేశారు. అభిమానులకు మరికొన్ని సర్ప్రైజ్ ఈవెంట్లు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఈసారి హైదరాబాద్ నైట్‌లైఫ్ కూడా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగమవుతోంది. ఆగస్టు 8 అర్ధరాత్రి ఖాజాగూడలోని ది పర్పుల్ హౌస్‌లో ఉన్న ఇన్సోమ్నియా క్లబ్లో మహేష్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్ ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మహేష్ బాబు సినిమాల పాటలతో ప్లేలిస్ట్, థీమ్ డెకరేషన్, ఫోటో బూత్, డ్యాన్స్ ఫ్లోర్, అర్ధరాత్రి కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్స్ సృష్టించడం కూడా అభిమానుల ప్రత్యేకత. ఈసారి ‘దూకుడు’ రీ రిలీజ్‌తో పాటు నగరవ్యాప్తంగా ఫ్యాన్ ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో సంబరాలు గతం కంటే మరింత భారీగా ఉండనున్నాయని అభిమానులు చెబుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది.
- Tags
- cinema
- mahesh babu
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!